- సైలెంట్‌గా ఓటీటీలోకి గోదారి గట్టుపైన
- అమెజాన్ ప్రైమ్‌లో అధికారిక స్ట్రీమింగ్
- ఆటో డ్రైవర్ చుట్టూ తిరిగే కథ
Godari Gattupaina OTT: మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన(Godari Gattupaina OTT)’.
నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, జగపతిబాబు, లైలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మే నెలలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. దాంతో, ఈ సినిమా ఇప్పుడు సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
ఈ చిత్ర కథ విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఆటో డ్రైవర్ తన చెల్లి స్నేహితురాలైన మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ఒక సెక్యూరిటీ గార్డ్ అయినప్పటికీ, తన కూతురిని ఉన్నత స్థాయిలో ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతుంటాడు. మరి తన కూతురు ఒక ఆటో డ్రైవర్‌ను ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? వారి ప్రేమను అంగీకరించాడా లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

