బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి కాస్త ఊరట. గోల్డ్ రేటు తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారత దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 11డాలర్లు తగ్గగా..ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,612 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,230కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది.ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,50,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,38,350 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,65,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
