Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold And Silver Rates : రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. వెండి ధర కూడా ఢమాల్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold And Silver Rates : రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. వెండి ధర కూడా ఢమాల్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

10tv 2 weeks ago
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం ధర వరుసగా రెండోరోజు భారీగా తగ్గింది. వెండి ధరసైతం తగ్గింది.మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 400 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 29 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,552 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
 మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధర భారీగా తగ్గింది.

కిలో వెండిపై రూ. 5వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది.
 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,230కాగా..

22 క్యారట్ల బంగారం ధర రూ.1,36,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,230కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,36,900 వద్ద కొనసాగుతుంది.
 వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
 గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv