Dailyhunt
Gold Silver Rate Today 4 April : బంగారం, వెండి కొనేవాళ్లకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Rate Today 4 April : బంగారం, వెండి కొనేవాళ్లకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

10tv 6 days ago
Gold Silver Rate Today 4 April : బంగారం, వెండి కొనేవాళ్లకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా గోల్డ్ రేటు పెరుగుతూ వస్తోంది.
అయితే, ఇవాళ బంగారం, వెండి కొనేవాళ్లకు కాస్త ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా..

గోల్డ్, సిల్వర్ ధరల్లో స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుంది.
 శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.10 పెరిగింది.. 22 క్యారట్ల బంగారంపైనా రూ. 10 పెరిగింది.

అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. ఔన్సు గోల్డ్ పై 108 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,677 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
 వెండి ధరలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

కిలో వెండిపై రూ. 100 తగ్గుదల చోటు చేసుకుంది.
 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,080కాగా..

22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,52,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,500 వద్ద కొనసాగుతుంది.
 వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది.
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv