Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HMD Pulse 2 Series : HMD కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ అంచనాలు.. లాంచ్‌కు ముందే పల్స్ 2 సిరీస్ ఫీచర్లు లీక్..!

HMD Pulse 2 Series : HMD కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ అంచనాలు.. లాంచ్‌కు ముందే పల్స్ 2 సిరీస్ ఫీచర్లు లీక్..!

10tv 1 week ago
  • హెచ్ఎండీ ప్లస్ 2 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి
  • ఈ ఫోన్లలో యునిసోక్ టి615 చిప్‌సెట్‌ అమర్చవచ్చు
  • 5000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు

HMD Pulse 2 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? HMD పల్స్ 2 సిరీస్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. లాంచ్ ముందే ఈ సిరీస్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌లో కంపెనీ హెచ్ఎండీ పల్స్ 2, పల్స్ 2 ప్లస్, పల్స్ 2 ప్రో అనే 3 మోడళ్లను రిలీజ్ చేయనుందని భావిస్తున్నారు.

అందులో హెచ్ఎండీ పల్స్ 2 సిరీస్, యూనిసోక్ T615 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్‌లు 5000mAh బ్యాటరీలతో రానున్నాయని అంచనా. లాంచ్ ముందే హెచ్ఎండీ పల్స్ 2 ఫోన్ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్ఎండీ పల్స్ 2 సిరీస్ స్పెసిఫికేషన్లు :
లాంచ్‌కు ముందే హెచ్ఎండీ పల్స్ 2 సిరీస్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఇందులో హెచ్ఎండీ పల్స్ 2, పల్స్ 2 ప్లస్, పల్స్ 2 ప్రో ఉండవచ్చు. స్పెసిఫికేషన్లను ప్యాషనేట్ గీక్జ్ వెల్లడించింది. కంపెనీ హెచ్ఎండీ పల్స్ 2 హెచ్ఎండీ పల్స్ 2 ప్లస్‌లో 6.67-అంగుళాల డిస్‌ప్లేను అందించవచ్చు.

హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ద్వారా ఈ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. హెచ్ఎండీ పల్స్ 2 బ్లాక్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. హెచ్ఎండీ పల్స్ 2 ప్లస్ ఆప్రికాట్ డార్క్ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది.

ఈ ఫోన్‌లు యూనిసోక్ T615 చిప్‌సెట్‌తో రన్ అవుతాయని భావిస్తున్నారు. కంపెనీ 6GB వరకు ర్యామ్ 128GB స్టోరేజ్‌ కూడా అందిస్తుందని అంచనా. ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా 2MP సెకండరీ కెమెరా ఉంటాయని అంచనా.

సెల్ఫీ కెమెరా భిన్నంగా ఉంటుందని అంచనా. స్టాండర్డ్ మోడల్‌లో 8MP కెమెరా ఉండగా, HMD పల్స్ 2 ప్లస్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. ఈ 2 ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో రన్ అవుతాయి. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి.

హెచ్ఎండీ పల్స్ 2 ప్రో 6.72-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇందులో యూనిసోక్ T615 చిప్‌సెట్‌ ఉండొచ్చు. ఈ ఫోన్‌లో 8GB వరకు ర్యామ్ 256GB వరకు UFS 2.1 స్టోరేజ్ ఉండవచ్చు. హెచ్ఎండీ పల్స్ 2 ప్రో బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. దీనికి సపోర్టుగా 8MP సెకండరీ సెన్సార్ కూడా ఉండనుంది.

కంపెనీ ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, గ్లేసియర్ గ్రీన్ ట్వైలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv