Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad Tesla: హైదరాబాద్‌లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..

Hyderabad Tesla: హైదరాబాద్‌లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..

10tv 3 days ago

Tesla In Hyderabad: గ్లోబల్ ఈవీ వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా.. త్వరలో హైదారాబాద్ లో విక్రయాలు జరపనుంది. తన సేవల (సేల్స్ అండ్ సర్వీస్) కేంద్రాన్ని హైదరాబాద్ లో త్వరలో ఏర్పాటు చేయడానికి టెస్లా ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సచివాలయంలో టెస్లా సంస్థ ఇండియా ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తాము హైదరాబాద్ లో అమ్మకాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్నట్లు వారు మంత్రికి తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ సిస్టమ్స్‌కు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బలమైన పర్యావరణ వ్యవస్థను తెలంగాణ అభివృద్ధి చేసిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డీప్-టెక్ రంగాలకు ఈ రాష్ట్రం ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రితో జరిగిన సమావేశానికి టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, పబ్లిక్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్ హాజరయ్యారు.

దేశంలో ఇప్పటికే నాలుగు సేల్స్ షోరూమ్‌లను ఏర్పాటు చేసిన టెస్లా, ఇప్పుడు తన తదుపరి కేంద్రం కోసం హైదరాబాద్‌ను పరిశీలిస్తుండటం పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. టెస్లా కేవలం ఈవీ (EV) తయారీదారుగా ఉండటాన్ని దాటి అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ వంటి రంగాలలో ఆవిష్కరణలు చేస్తోందన్నారు. నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన చిప్స్, సెన్సార్ల అభివృద్ధిలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోందని శ్రీధర్ బాబు అన్నారు.

ప్రస్తుతం భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం నాలుగు శాతం మాత్రమే ఉండగా, ఈ రంగంలో అపారమైన వృద్ధి సామర్థ్యం ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి, హైదరాబాద్‌ను స్వచ్ఛ సాంకేతికత, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

తెలంగాణలో ఈవీ తయారీకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలను స్థాపించే అవకాశాలను అన్వేషించాలని టెస్లా ప్రతినిధులను కోరారు మంత్రి శ్రీధర్ బాబు. పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv