Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ

HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ

10tv 4 days ago
  • హైకోర్టును ఆశ్రయించిన రంగనాథ్
  • సింగిల్ జడ్జ్ తీర్పుపై అప్పీల్
  • శాంతా శ్రీరామ్ కేసులో ట్విస్ట్

HYDRAA Ranganath: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా దూసుకుపోతున్న ‘హైడ్రా’ (HYDRAA) చుట్టూ రాజకీయ, న్యాయపోరాటాలు మరింత తీవ్రమవుతున్నాయి.

శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వివాదాస్పద కేసులో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సింగిల్ జడ్జ్, ఆయనను ఆ పదవి నుంచి తప్పించి మరొక అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అనూహ్య తీర్పుతో ఒక్కసారిగా ఐఏఎస్ వర్గాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.

హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన రంగనాథ్

సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRAA Ranganath)వేగంగా స్పందించారు. తనను తప్పించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అత్యవసరంగా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ విషయంలో హైడ్రా నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని, చట్టపరిధిలోనే చర్యలు తీసుకున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు బెంచ్ ఏ విధంగా స్పందిస్తుందో, కమిషనర్ రంగనాథ్‌కు ఉపశమనం లభిస్తుందో లేదో అని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv