- జూన్ 6 నుంచి 10 వరకు భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు
- ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టిన భారత్..
IND vs AFG : ఐపీఎల్ 2026 ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది.
ఇక క్రికెట్ అభిమానుల అందరి దృష్టి భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్‌పై పడింది. జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టీ20 ఫార్మాట్ నుంచి భారత ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు ఎంత త్వరగా అలవాటు పడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
ఈ టెస్టు సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ముల్లాన్‌పూర్ చేరుకుంది. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతుంది. బుధవారం నెట్స్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు దాదాపు 25 నిమిషాల పాటు విరామం లేకుండా బౌలింగ్ చేశారు. ఎండ తీవ్రతను లెక్క చేయకుండా సుదీర్ఘ స్పెల్స్ వేసి తమ ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు
RCB Bench Players : ఛాంపియన్ జట్టులో భాగమై.. ఒక్క మ్యాచ్ ఆడని ఆర్‌సీబీ ఆటగాళ్లు.. వేలంలో కోట్ల వర్షం
ఇక టీమ్ఇండియా టెస్టు జట్టులో తొలిసారి ఎంపికైన గుర్నూర్ బ్రార్ కూడా బౌన్సర్లతో ఆకట్టుకున్నాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్లను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లకు సూచనలు చేశాడు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ తమ బ్యాట్లకు పని చెప్పగా.. పంత్ వికెట్ కీపింగ్ పై దృష్టి సారించాడు.
ఈ మ్యాచ్ ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరిధిలోకి రానప్పటికీ కూడా భారత్ బలమైన జట్టునే ఎంపిక చేసింది. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. అతనికి విశ్రాంతి అవసరమని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)

