Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs NZ : రెండో టెస్టు.. ముగిసిన తొలి రోజు ఆట‌..

IND vs NZ : రెండో టెస్టు.. ముగిసిన తొలి రోజు ఆట‌..

10tv 17 hrs ago

క్రైvs NZ : క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగులు చేసింది.

టామ్ బండ్లెట్ (53), గ్లెన్ ఫిలిప్స్ (36)లు క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు టామ్ లాథ‌మ్ (59; 128 బంతుల్లో 6 ఫోర్లు), డేవాన్ కాన్వే (31; 79 బంతుల్లో 4 ఫోర్లు) లు శుభారంభం ఇచ్చారు. పిచ్‌ నుంచి బౌల‌ర్ల‌కు స‌హ‌కారం అందుతుండ‌డంతో ఈ జోడీ చాలా జాగ్ర‌త్త‌గా బ్యాటింగ్ చేసింది. క్రీజులో కుదురుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. మంచి బంతుల‌ను గౌర‌విస్తూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించింది. తొలి వికెట్‌కు 77 ప‌రుగులు జోడించాక కాన్వేను ఔట్ చేయ‌డం ద్వారా గుర్నూర్ బ్రార్ ఈ జోడిని విడ‌గొట్టారు.

ఆ త‌రువాత కాసేప‌టికే టామ్ లాథమ్ అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. ఈ స‌మ‌యంలో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. వ‌రుస ఓవ‌ర్ల‌లో టామ్ లాథ‌మ్‌, హెన్రీ నికోల్స్ (16), ర‌చిన్ ర‌వీంద్ర (0)ల‌ను ఔట్ చేశారు. లాథ‌మ్, ర‌చిన్ రవీంద్ర‌ల‌ను ఆకాశ్ దీప్ ఔట్ చేయ‌గా, నికోల్స్‌ను అన్షుల్ పెవియ‌లిన్‌కు చేర్చాడు. దీంతో 110 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో డారిల్ మిచెల్ (37), టామ్ బండ్లెట్‌ను ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ ప‌రుగులు రాబ‌ట్టారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని మిచెల్‌ను ఔట్ చేయ‌డం ద్వారా వాషింగ్ట‌న్ సుంద‌ర్ విడ‌గొట్టాడు. మిచెల్, బండ్లెట్ లు ఐదో వికెట్‌కు 74 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

మిచెల్ ఔట్ అయిన త‌రువాత బండ్లెట్‌కు గ్లెన్ ఫిలిఫ్స్ జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు మ‌రో వికెట్ ప‌డ‌నీయ‌కుండా తొలి రోజును ముగించారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 62 ప‌రుగులు జోడించింది. రెండో రోజు వీరిని ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరుస్తారు అన్న దానిపైనే కివీస్ స్కోరు ఆధార‌ప‌డి ఉంటుంది.

భార‌త బౌల‌ర్ల‌లో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. అన్షుల్ కాంబోజ్‌, గుర్నూర్ బ్రార్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv