India Vs Afghanistan : అఫ్గానిస్థాన్ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.
ఈ జట్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి చోటు దక్కించుకున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం లభించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.
జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
అయితే.. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాలు ఫిట్‌నెస్ క్లియరెన్స్ తరువాతనే జట్టులోకి వస్తారు. లేదంటే తుది జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
హార్దిక్‌కు నో చాన్స్..
అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ ద్వారా మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్ తగిలింది. సెలెక్టర్లు అఫ్గాన్‌తో సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయలేదు. తొడ కండరాల గాయంతో బాధపడిన హార్దిక్ పాండ్యా గత కొన్ని నెలలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసంలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడని సీవోఈ వర్గాలు వెల్లడించడంతో అతడు అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. అయితే, మళ్లీ హార్డిక్ పాండ్యాకు గాయమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అఫ్గాన్‌తో టీ20 సిరీస్ కోసం హార్దిన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
భారత్, అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 మ్యాచ్ - సెప్టెంబర్ 13న
రెండో టీ20 మ్యాచ్ - సెప్టెంబర్ 15న
మూడో టీ20 మ్యాచ్ - సెప్టెంబర్ 17న

