Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026: చెన్నై ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్, గుజరాత్

IPL 2026: చెన్నై ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్, గుజరాత్

10tv 6 days ago

IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ దుమ్మురేపింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

181 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో సీఎస్కేని చిత్తు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది హైదరాబాద్. మరో జట్టు గుజరాత్ టైటాన్స్ సైతం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.

హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో హెన్రిచ్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్ ఆడాడు. 26 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు.

ఇప్పటివరకు మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లాయి. ఇక సీఎస్ కే క్వాలిఫై అవ్వాలంటే చివరి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అలాగే మిగతా జట్ల ప్రదర్శనపై ఆధార పడాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv