IPL 2026: కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ గర్జించింది.
ఆల్ రౌండ్ షోతో దుమ్మురేపింది. తొలుత బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తే, తర్వాత బౌలర్లు చెలరేగారు. ఈ సీజన్ లో చెన్నైని రెండుసార్లు ఓడించింది గుజరాత్.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. 230 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే.. 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 89 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది గుజరాత్. గుజరాత్ బౌలర్లు చెలరేగిపోయారు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. సిరాజ్, రబాడ, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు తీసి సీఎస్కే ఓటమిని శాసించారు.

