Ishan Kishan : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. అతడు ఇంకో 15 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
నేటి నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇషాన్ ఎంపిక అయ్యాడు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో అతడు ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
అదే జరిగితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న ఆరో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాలు మాత్రమే ఇప్పటి వరకు భారత్ తరుపున టీ20ల్లో 100 కన్నా ఎక్కువ సిక్సర్లు బాదారు.
Sree Charani : జపాన్‌లో తెలుగమ్మాయి.. క్రికెటర్ శ్రీచరణి ఫోటోలు వైరల్..
ఇషాన్ కిషన్ 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 61 మ్యాచ్‌లు ఆడాడు. 31.1 సగటుతో 1801 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 181 ఫోర్లు, 85 సిక్సర్లు బాదాడు.
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. అతడు 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు బాదాడు.
భారత్ తరుపున టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ - 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ - 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ - 62 మ్యాచ్‌ల్లో 134 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా - 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ - 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు

