Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ITR Last Date Extension : బిగ్ టెన్షన్.. జూలై 31 డెడ్‌లైన్.. ITR గడువు పెంచారా? లేదా? టాక్స్ పేయర్లు ఇప్పుడు ఏం చేయాలి?

ITR Last Date Extension : బిగ్ టెన్షన్.. జూలై 31 డెడ్‌లైన్.. ITR గడువు పెంచారా? లేదా? టాక్స్ పేయర్లు ఇప్పుడు ఏం చేయాలి?

10tv 1 week ago
  • డెడ్‌లైన్ అయిపోయిందా? ఐటీఆర్ ఫైలింగ్‌పై తాజా అప్‌డేట్
  • జీతం పొందేవారికి అలర్ట్.. ఈరోజే ITR ఫైల్ చేయాలా?
  • జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏమవుతుంది?

ITR Last Date Extension : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. అందులోనూ జీతం పొందే పన్నుచెల్లింపుదారులు అసలు ఆలస్యం చేయొద్దు.. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు జూలై 31తో ముగియనుంది. ఈ డెడ్‌లైన్ దాటితే భారీగా నష్టపోతారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి గడువు పొడిగింపుపై తీవ్రచర్చ మొదలైంది. సోషల్ మీడియాలో, గూగుల్ సెర్చ్‌లలో (ITR Last Date Extension) కోసం భారీగా సెర్చ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఆదాయపు పన్ను శాఖ ఇప్పటివరకు ఐటీఆర్ గడువు పొడిగిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో జూలై 31నే ITR-1, ITR-2 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారమ్స్ అర్హులైన జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర (ITR Last Date Extension) వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీగా గమనించాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు గడువు పెరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

గడువు పొడిగింపు ఎందుకు లేదంటే? :
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈసారి ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను చివరి నిమిషంలో వచ్చే భారీ రద్దీని కూడా తట్టుకునేలా రెడీ చేసింది. రోజుకు కోటి వరకు ఐటీఆర్ లను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

అలాగే, అధిక రద్దీ సమయంలో కూడా రోజుకు 1.61 కోట్ల వరకు లావాదేవీలు, దాదాపు 99 లక్షల లాగిన్‌లను సిస్టమ్ ఫాస్ట్‌గా హ్యాండిల్ చేసిందని వెల్లడించింది. దీంతో గతంలోలా సాంకేతిక సమస్యల కారణంగా గడువు పెంచాల్సిన పరిస్థితి ఈసారి కనిపించడం లేదు.

కొందరికి గడువు పొడిగింపు :
ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాల పన్నుచెల్లింపుదారులకు భారీ ఉపశమనం అందించింది. వ్యాపార, వృత్తి ఆదాయం ఉన్నప్పటికీ ట్యాక్స్ ఆడిట్‌కు లోబడని ITR-3, ITR-4 దాఖలుదారులకు ఇప్పటికే ఆగస్టు 31, 2026 వరకు గడువు పొడిగించింది. జూలై 31 గడువు ప్రధానంగా ITR-1, ITR-2 దాఖలు చేసే జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకే వర్తిస్తోంది.

భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలు :
జూలై 27 నాటికి 4.37 కోట్లకు పైగా ఐటీఆర్ దాఖలయ్యాయి. అందులో 4.11 కోట్లకు పైగా రిటర్న్స్ వెరిఫై కాగా, 2.3 కోట్లకు పైగా ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. అంటే.. ఎక్కువ మంది అర్హులైన పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ రిటర్న్ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు అనమాట.

గత ఏడాదిలా ఈసారి ఎందుకు లేదు? :
2025లో కొత్త ఐటీఆర్ ఫారమ్‌ల విడుదల ఆలస్యమైంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. అప్పట్లో పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియా ద్వారా కూడా గడువు పెంచాలని భారీఎత్తున డిమాండ్ చేశారు. ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు పెద్దగా లేవు. ఫారమ్‌లు, సిస్టమ్ అప్‌డేట్‌లు కూడా ముందుగానే అందుబాటులోకి వచ్చాయి. గడువు పొడిగించే అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

గడువు మిస్ అయితే ఏమవుతుంది? :

ఒకవేళ ప్రభుత్వం ఐటీఆర్ గడువు పొడిగించకపోతే.. జూలై 31 తర్వాత కూడా బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయొచ్చు. అయితే, భారీ పెనాల్టీలతో టాక్స్ కట్టాల్సి రావొచ్చు.

* ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం ఆలస్య రుసుము విధిస్తారు
* చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.
* రీఫండ్ రావడంలో ఆలస్యం జరిగే ఛాన్స్ ఎక్కువ
* కొన్ని పన్ను ప్రయోజనాలు, నిబంధనల పరంగా ఇబ్బందులు తప్పవు

గతంలో గడువు పెరిగిందా? :

గత 6 అసెస్‌మెంట్ సంవత్సరాల్లో 5 సందర్భాల్లో గడువు పొడిగించారు. అయితే, వాటికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. కోవిడ్-19 మహమ్మారి, ఆడిట్ గడువులు, కొత్త ఐటీఆర్ ఫారమ్ విడుదల ఆలస్యం వంటి పరిస్థితుల వల్లే కేంద్రం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిస్థితుల్లో మాత్రం గడువు పొడిగింపు చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

టాక్స్ పేయర్లు ఇప్పుడేం చేయాలి? :

జీతం పొందే ఉద్యోగులు ITR-1 లేదా ITR-2 దాఖలు చేయాల్సిన వారు అధికారిక ప్రకటన వచ్చే వరకు గడువు పెరుగుతుందని భావించి వేచిఉండొద్దు. అవసరమైన ఫారమ్-16, ఫారమ్ 26AS, AIS, TIS వంటి వివరాలను ఒకసారి చెక్ చేసి మీ అర్హత మేరకు వెంటనే ఐటీఆర్ దాఖలు చేయడం బెటర్.

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీఆర్ గడువు అధికారికంగా పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు జూలై 31నే చివరి తేదీ. అందుకే జీతం పొందే పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ఎంతైనా మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv