Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jabardasth Comedian : జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న మరో కమెడియన్..

Jabardasth Comedian : జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న మరో కమెడియన్..

10tv 6 days ago

Jabardasth Comedian : తెలుగు టీవీ ప్రేక్షకులను చాలా ఏళ్లుగా నవ్విస్తున్న షో జబర్దస్త్. జబర్దస్త్ షోతో ఎంతో మంది కమెడియన్స్, రచయితలు ఫేమ్ తెచ్చుకున్నారు.

అయితే జబర్దస్త్ నుంచి పాత వాళ్ళు వెళ్లిపోవడం, కొత్తవాళ్లు రావడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. ఇప్పటికే జబర్దస్త్ మొదలుపెట్టిన టీమ్స్ అన్ని వెళ్లిపోయాయి. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అదిరే అభి.. ఇలా చాలా మంది జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోయి సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు జబర్దస్త్ నుంచి మరో రచయిత, కమెడియన్ వెళ్లిపోతున్నారు అని తెలుస్తుంది. అతనెవరో కాదు ఆటో రామ్ ప్రసాద్. రచయితగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ప్రసాద్ ఆ తర్వాత సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి స్కిట్స్ చేస్తూ ఆర్టిస్ట్ గా కూడా మారాడు. జబర్దస్త్ లో ఇప్పటికి స్కిట్స్ రాస్తూ కామెడీ చేస్తూ మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాల బిజీతో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ వదిలేయగా త్వరలోనే రామ్ ప్రసాద్ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని తెలుస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చి రాంప్రసాద్ తో కలిసి స్పెషల్ స్కిట్ చేసారు. యాంకర్ రష్మీ మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నారు. ఈ టీమ్ లో మొదట వెళ్ళిపోయింది సుధీర్ అంటూ ఎమోషనల్ అయింది. దీంతో ఆ టీమ్ లో గెటప్ శ్రీను కూడా వెళ్ళిపోయాడు, రామ్ ప్రసాద్ కూడా వెళ్ళిపోతున్నట్టు ఈ ఎపిసోడ్ లో ప్రకటిస్తారని సమాచారం. రామ్ ప్రసాద్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికే సుధీర్, గెటప్ శ్రీను వచ్చారని తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.

రామ్ ప్రసాద్ దర్శకుడిగా మారబోతున్నాడని, అందుకే జబర్దస్త్ ని వదిలేస్తున్నదని సమాచారం. ఇప్పటికే జబర్దస్త్ నుంచి కమెడియన్స్ వేణు, ధనరాజ్, అదిరే అభి దర్శకులుగా మారి సినిమాలు తీసి మెప్పించారు. కిరాక్ ఆర్పీ, రచ్చ రవిలు కూడా దర్శకుడిగా సినిమాలు ప్రకటించారు. ఇప్పుడు ఆటో రామ్ ప్రసాద్ దర్శకుడిగా మారి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv