- దొంగతనంపై అసిస్టెంట్ ను నిలదీయడమే కారణం
- దాడిలో కొమురక్కకు తీవ్ర గాయాలు
- కొమురక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Jabardasth Komurakka: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో జబర్దస్త్ నటి కొమురక్క(Jabardasth Komurakka)పై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది.
అభిమానులమంటూ ఆమె నివాసానికి వచ్చిన సుమారు ఎనిమిది మంది యువకులు, ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి కొమురక్కతో పాటు ఆమె సోదరుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొమురక్క తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఆమె ఇంట్లో జరిగిన బంగారం దొంగతనం విషయమై తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను కొమురక్క నిలదీయడమే ఈ గొడవకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
Euphoria OTT: ఓటీటీలో కొత్త సినిమా 'యుఫోరియా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఈ నేపథ్యంలోనే శ్రీనాథ్ స్నేహితులు ఆమెపై కక్షగట్టి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెలబ్రిటీ హోదాలో ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే కొమురక్కపై ఇలాంటి దాడి జరగడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

