Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jio Recharge Plans : జియో మాస్టర్ స్ట్రోక్.. జియోఫోన్ ప్లాన్లకు గుడ్‌బై.. 4G ఫీచర్ ఫోన్ ఎరా స్టార్ట్.. జస్ట్ రూ. 21తోనే ప్లాన్ యాక్టివ్!

Jio Recharge Plans : జియో మాస్టర్ స్ట్రోక్.. జియోఫోన్ ప్లాన్లకు గుడ్‌బై.. 4G ఫీచర్ ఫోన్ ఎరా స్టార్ట్.. జస్ట్ రూ. 21తోనే ప్లాన్ యాక్టివ్!

10tv 2 weeks ago
  • జియోఫోన్ మొబైల్ ప్లాన్లకు ఎండ్ కార్డ్
  • జియోభారత్ ఇకపై 4జీ ఫీచర్ ఫోన్ ప్లాన్లుగా మార్పు
  • జియో 4జీ ఫీచర్ ఫోన్ యాడ్ ఆన్ ప్లాన్లు
  • ట్రాయ్ ఆదేశాలతో జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్లు తొలగింపు

Jio Recharge Plans : రిలయన్స్ జియోకు యూజర్లకు బిగ్ అలర్ట్.. నివేదిక ప్రకారం.. జియోభారత్, జియోఫోన్ ప్రైమా ప్లాన్‌లను పూర్తిగా తొలగించింది. ‘జియోభారత్’ ఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ల పేరును కూడా ‘4జీ ఫీచర్ ఫోన్ ప్లాన్‌లు’గా మార్చేసింది.

అలాగే, జియోఫోన్ డేటా యాడ్-ఆన్ పేరు ‘4జీ ఫీచర్ ఫోన్ యాడ్-ఆన్‌లు’గా మారాయి. ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకు (Jio Recharge Plans) జియో ఈ మార్పులు చేసింది. అన్ని ఫోన్లలో కూడా జియోఫోన్ జియోభారత్ ఫోన్‌ రీఛార్జ్‌లను తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది.

జియో రీఛార్జ్‌ల కన్నా జియోఫోన్, జియోభారత్ రీఛార్జ్‌లు గతంలో (Jio Recharge) చౌకగా ఉండేవి. వాస్తవానికి, జియోఫోన్ జియోభారత్ ఫోన్‌లకు వేర్వేరు రీఛార్జ్‌లను రిలయన్స్ జియోనే ప్రవేశపెట్టింది.
జియోఫోన్ జియోభారత్ అనేవి 4G యూజర్లకు అందించే ఫీచర్ ఫోన్లు. 4G నెట్‌వర్క్‌లో ఈ ఫోన్‌లకు తక్కువ ధరకే రీఛార్జ్‌లను అందించేది. పాత జియోఫోన్ ప్లాన్‌లను పూర్తిగా తొలగించింది.

ట్రాయ్ కీలక సూచనలివే :
టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో జియో డివైస్ టారిఫ్ ప్లాన్‌లను సవరించి అన్ని డివైస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. ఆ కంపెనీ ట్రాయ్ సూచనలను పాటించి ఆ రీఛార్జ్ ప్లాన్‌లకు ‘4జీ ఫీచర్ ఫోన్ ప్లాన్’ ‘4జీ ఫీచర్ ఫోన్ యాడ్-ఆన్’ అని పేరు మార్చింది.

అయితే, ఈ రీఛార్జ్‌లు కేవలం జియోఫోన్ జియోభారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయా? లేదా జియో సిమ్ వాడే ఏ 4G స్మార్ట్‌ఫోన్ యూజర్ అయినా తీసుకోవచ్చా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

జియో 4జీ ఫీచర్ ఫోన్ ప్లాన్‌లు :
రూ. 123 ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 0.5GB డేటా, 300 SMS అందిస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. జియో 4G యూజర్ల కోసం రూ. 234 ప్లాన్‌ కూడా అందిస్తోంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 0.5GB డేటా, 300 SMS లభిస్తాయి. వ్యాలిడిటీ 56 రోజులు.

84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 0.5GB డేటాను అందించే రూ. 369 ప్లాన్ కూడా ఉంది. 336 రోజుల వ్యాలిడిటీతో 4జీ ఫీచర్ ఫోన్ ప్లాన్‌ను రూ. 1234కు అందిస్తోంది. జియోభారత్ జియోఫోన్ కస్టమర్లు కాకుండా ఇతర ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా ఇప్పుడు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

4జీ ఫీచర్ ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు :
జియో 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కొత్త డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 26కు 2జీబీ డేటా లభిస్తుంది. రూ. 62కు 6GB లభిస్తుంది. ఈ రెండూ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి.

ఇతర ప్లాన్‌లలో రూ. 86కు రోజుకు 0.5GB డేటా (మొత్తం 14GB), రూ. 122కు రోజుకు 1GB డేటా (మొత్తం 28GB), రూ. 182కు రోజుకు 2GB డేటా (మొత్తం 56GB) ఉన్నాయి. ఈ యాడ్-ఆన్‌లన్నీ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.

రూ. 21తో రీఛార్జ్ :
కొత్త 4జీ ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే ఫస్ట్ రీఛార్జ్‌ను కేవలం రూ. 21కే పొందవచ్చు. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 0.5GB డేటా, 15 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ, కేవలం 4 రోజులకు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది.

జియో ప్రకారం.. ‘4జీ ఫీచర్ ఫోన్’ 4జీ LTE-VoLTE సర్వీసుకు సపోర్టు ఇచ్చే కీప్యాడ్ ఫోన్. ఈ ఫోన్ యూజర్ల కోసం చౌకైన రూ. 91 ప్లాన్ ఇప్పుడు అందుబాటులో ఉండదు. ఇకపై బేస్ ప్లాన్ రూ. 123 తీసుకోవాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv