Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jonnavithula Ramalingeswara Rao : దర్శకుడిగా మారిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు..

Jonnavithula Ramalingeswara Rao : దర్శకుడిగా మారిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు..

10tv 6 days ago

Jonnavithula Ramalingeswara Rao : ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో లలిత అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

కాస్మిక్ పవర్ క్రియేట్స్ LLP బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నందిని హీరోయిన్‌గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా నటిస్తున్నారు.

తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా లలిత అనే సినిమాని సామాజిక నేపథ్య సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు…’ అనే క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఈ సినిమాకు మ్యూజికల్ డ్యుయో మణి, నాగరాజు సంగీతం అందిస్తున్నారు. నేడు ఈ సినిమా హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ సినిమాలో రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్.. పలువురు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv