Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kamakshi Bhaskarla : ఇవే సినిమాలు తమిళ్‌లో చేస్తే అవార్డులు వచ్చేవి.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

Kamakshi Bhaskarla : ఇవే సినిమాలు తమిళ్‌లో చేస్తే అవార్డులు వచ్చేవి.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

10tv 1 week ago

Kamakshi Bhaskarla : ప్రియురాలు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మా ఊరి పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది కామాక్షి భాస్కర్ల. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క కీలక పాత్రల్లో, నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

త్వరలో అగధ అనే సినిమాతో రాబోతుంది. డాక్టర్ నుంచి యాక్టర్ గా మారిన ఈ భామ తెలుగు అమ్మాయే.

తాజాగా అగధ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో,, తెలుగులో మంచి సినిమాలు, యాక్టింగ్ తో మెప్పించారు. వరుసగా డిఫరెంట్ పాత్రలతో కనిపిస్తున్నారు. అయినా స్టార్ హీరోయిన్స్ స్టార్ డమ్ రాలేదు, కమర్షియల్ సినిమాకు ఎందుకు చెయ్యట్లేదు అని అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కామాక్షి భాస్కర్ల.

తను చేసిన సినిమాల గురించి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. ఇవే సినిమాలు, ఇదే యాక్టింగ్ తమిళ్ లో చేస్తే అవార్డులు, నేషనల్ అవార్డులు వచ్చేవి. ఇక్కడ చేస్తే కమర్షియల్ హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు అందుకే ఇలాంటి సినిమాలు చేస్తుంది అంటారు. వేరే లాంగ్వేజ్ లో చేస్తే అలా చేసే వాళ్ళను చాలా బాగా చేసారు, అవార్డు వచ్చింది అని ఇక్కడకు తెచ్చుకుంటారు. నాకు మొదట ఇలాంటి సినిమా వచ్చింది ఇవి చేయలేక కాదు. అందుకే నాకు వచ్చినవాటిల్లో బెస్ట్ చేసుకుంటూ వస్తున్నా.

నా కెరీర్ ఎప్పుడూ నా ఇష్టమే. నేను ఆరేళ్ళ నుంచి కష్టపడుతున్నా, మంచి పాత్రలు చేస్తున్నా కూడా ప్రాపర్ స్టార్ డమ్, నాకు రావాల్సినంత పేరు రాలేదు అని అనిపిస్తుంది. కానీ కష్టపడేవాళ్ళకు ఏదో ఒక రోజు వస్తుంది. తెలుగు హీరోయిన్స్ ఇంకా రావట్లేదు. చాలా మంది తెలుగు వాళ్ళు రావడానికి నేను సక్సెస్ అయి కారణం అవ్వాలి. అందుకే నేను తెలుగులోనే చేస్తాను. వేరే భాషల్లో మంచి పాత్రలు వస్తే ఆలోచిస్తాను. ఒక్కసారి తెలుగు అమ్మాయి సక్సెస్ అయితే వందమంది తెలుగు హీరోయిన్స్ వస్తారు అని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv