Kavitha TRS : కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కవితకు అప్పగిస్తూ సీఈసీ ఆమోద ముద్ర వేసింది.
ఈ మేరకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో అధికారులు లేఖను అందజేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల నూతన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లాలో ఏప్రిల్ 25న బహిరంగ సభ వేదికగా కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా కవిత ప్రకటించారు. అయితే, ఆ పేరు కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా ఈసీ ఆమోదించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఎన్నికల అధికారులు లేఖ అందజేశారు.

