Dailyhunt
KBR Park: నగరవాసులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్..

KBR Park: నగరవాసులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్..

10tv 2 weeks ago
  • కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్స్
  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు
  • స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రయల్ రన్
  • ఆదివారం ఉ. 11 గంటల నుంచి మ.1 గంట వరకు వన్ వే ట్రయల్ రన్

KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నాయి. స్టీల్ బ్రిడ్జి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు పోలీసులు. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉండనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేయనున్నారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్ కు వెళ్లేందుకు గాను రోడ్ నెంబర్ 2లో డైవర్షన్ తీసుకుని ఇందిర నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45కు వెళ్లేందుకు వన్ వే ను ఏర్పాటు చేయబోతున్నామని పోలీసులు వెల్లడించారు.

”కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నాం. కేటీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేశాం. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (3 గంటల పాటు) వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నాం. ఈ నెల 5న నిర్వహించబోతున్న ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ రన్ ప్రజలందరూ గమనించాలి” అని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ కోరారు.

రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్ లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామన్నారాయన. పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు మాదాపూర్ కు వెళ్లేందుకు రోడ్ నెంబర్ 2 లో డైవర్షన్ తీసుకొని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45 కి వెళ్లేందుకు వన్ వే ను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు.

రోడ్ నెంబర్ 45 నుండి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుండి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లిస్తామన్నారు. రోడ్ నెంబర్ 10, 12 నుండి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుండి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుండి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ చేరుకునే విధంగా డైవర్షన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రజలందరికీ హైదరాబాద్ ట్రాఫిక్ అడ్వైజరీలో భాగంగా తెలియజేస్తున్న సూచనలను పాటించి సహకరించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv