Keralam Election Results 2026 Live : కేరళలో యూడీఎఫ్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేరళం అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విజయంపై స్పందించారు. నిర్ణయాత్మక తీర్పు చెప్పిన కేరళ ప్రజలకు థాంక్స్ చెప్పారు.
కేరళ విజయం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.
కాంగ్రెస్ నేతలకు, యూడీఎఫ్ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన సీఎం
కష్టపడి సాధించిన చారిత్రాత్మక విజయమన్న సీఎం
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్, దీపా దాస్ మున్షీకి ప్రత్యేక అభినందనలు
నాయకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందన్న రేవంత్
కేరళ ప్రచారంలో తనకు చూపిన అభిమానానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం
తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపిన రేవంత్
తెలంగాణ, కేరళ రాష్ట్రాలు అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగుతున్నాయన్న రేవంత్
దశాబ్ద కాల నిరాశ తర్వాత కొత్త భవిష్యత్‌కు శ్రీకారం అన్న సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి దిశగా కేరళ ముందుకు వెళ్తుందని నమ్మకం
పుత్తుప్పల్లిలో విజయం సాధించిన కాంగ్రెస్ మాజీ సీఎం చాందీ ఊమెన్.
యూడీఎఫ్ టీమ్ వర్క్ వల్లే ఆ కూటమి విజయం సాధించిందని కేరళలో ప్రధాన పార్టీగా పేరుపొందిన IUML అభిప్రాయపడింది.

కేరళ సీఎం రేసులో ఉన్న ముగ్గురు నేతలు వీళ్లే. లింక్ మీద క్లిక్ చేసి స్టోరీ చదవండి.
కేరళలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో హస్తం పార్టీలో జోష్ నెలకొంది. కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
కేేరళలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. సాక్షాత్తూ సీఎం పినరయి విజయన్ వెనుకంజలో ఉన్నారు. ఆయన కేబినెట్ లో 12 మంది మంత్రులు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది.
కేరళ అసెంబ్లీ ఫలితాలు రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పబోతున్నాయి: బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖరన్
ధర్మదం అసెంబ్లీ సీటులో ముందంజలో సీఎం పినరయి విజయన్.
కేరళలో వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ దూసుకెళ్తుంది. ఆల్రెడీ మేజిక్ ఫిగర్ దాటింది. కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉండగా, యూడీఎఫ్ 71 సీట్లలో లీడ్ లో ఉంది. అయితే, ఎల్డీఎఫ్ కూడా వెనుకే వస్తోంది. 63 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ కనిపిస్తోంది. కామ్రేడ్ల సారధ్యంలోని ఎల్డీఎఫ్ వెనుకబడింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టి నెలకొంది. ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 9వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కేరళంలో 79.63శాతం ఓటింగ్ నమోదైంది. కేరళలో చాలా కాలంగా సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎప్ కూటమి మధ్య పోటీ జరుగుతోంది. సీఎం పినరయి విజయన్ ఎల్డీఎఫ్ కూటమికి నాయకత్వం వహించారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని ఎల్‌డీఎఫ్ భావిస్తుండగా.. మరోవైపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిసైతం కేరళంలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టడంతో ఈసారి కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 71గా ఉంది.

