Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kevvu Kartheek : తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. ఎమోషనల్ పోస్ట్..

Kevvu Kartheek : తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. ఎమోషనల్ పోస్ట్..

10tv 1 week ago

Kevvu Kartheek : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో కెవ్వు కార్తిక్ ఒకరు. అవినాష్ తో కలిసి స్కిట్స్ చేసి మెప్పించిన కార్తిక్ ప్రస్తుతం జబర్దస్త్ లో అడపాదడపా కనిపిస్తున్నాడు.

కార్తీక్ ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలతో అలరిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్.

నేడు కెవ్వు కార్తీక్ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కార్తీక్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. హాస్పిటల్ లో తన భార్య, బిడ్డలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. మేం అమ్మనాన్నలు అయ్యాము. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది. కొత్త వెలుగు మా జీవితాల్లోకి వచ్చింది. మేము పేరెంట్స్ అయ్యాం అని గర్వంగా చెప్తున్నాం అని తెలిపాడు.

అయితే పుట్టింది బాబు లేదా పాప అనే విషయాన్ని వెల్లడించకుండా గెస్ చేయండి అని పోస్ట్ పెట్టాడు. కెవ్వు కార్తీక్ తండ్రి కావడంతో పలువురు జబర్దస్త్ కమెడియన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv