Dailyhunt
Kiran Abbavaram: దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. తొలి అడుగు 'రియాలిటీ'తోనే

Kiran Abbavaram: దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. తొలి అడుగు 'రియాలిటీ'తోనే

10tv 3 weeks ago
  • కిరణ్ అబ్బవరం కొత్త ప్రయాణం
  • దర్శకుడిగా రియాలిటీ మూవీ
  • దీపావళికి రిలీజ్ కానున్న మూవీ

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

క, కె-ర్యాంప్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు విజయాలతో ఆయన మార్కెట్, క్రేజ్ రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఆయనకు పది కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు నిర్మాతలు. కానీ, ఆ ఆఫర్లను పక్కన పెట్టి పెట్టి తనలోని దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. గతంలో షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవంతో ఇప్పుడు సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

Nainika Anasuru: ఢీ డాన్సర్ నైనికా అనసూరు.. హాట్ అండ్ క్రేజీ ఫోటోలు వైరల్

అదే ‘రియాలిటీ’. ప్రస్తుతం జనరేషన్ కి తగ్గట్టుగా ఈ రియాలిటీ అనే కథను సిద్ధం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన సొంత బ్యానర్‌లో నిర్మించిన 'తిమ్మరాజుపల్లె టీవీ' చిత్రం ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ ద్వారా ఆయన ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఇలా వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా తన ముద్ర వేయడానికి కిరణ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఇక కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహించనున్న ‘రియాలిటీ’ చిత్రం మే 2026లో షూటింగ్ ప్రారంభించుకోనుంది. తన హిట్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ సినిమాను కూడా నవంబర్ నెలలో దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా ఇలా మూడు విభిన్న పాత్రలను పోషిస్తూ కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv