Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి? బీజేపీలో బిగ్ రిఫార్మ్స్.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి? బీజేపీలో బిగ్ రిఫార్మ్స్.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

10tv 2 weeks ago
  • సెప్టెంబర్‌లో కేంద్ర క్యాబినెట్ విస్తరణ
  • సీనియర్లను తప్పించి యువతకు అవకాశం
  • కిరణ్ రెడ్డికి గవర్నర్ గిఫ్ట్

Kiran Kumar Reddy: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలోనూ, బిజెపి పార్టీ యంత్రాంగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం కానుందని ఢిల్లీ వర్గాల్లో బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

యువతకు పెద్దపీట – 70 ఏళ్లు దాటిన మంత్రులకు విరామం:

ఈసారి చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో యువ నాయకులకు విస్తృతంగా అవకాశాలు కల్పించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా కేంద్ర, సహాయ మంత్రులను పదవుల నుంచి తప్పించి, వారికి పార్టీ బాధ్యతలు లేదా ఇతర కీలక పదవులు అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రధానితో సహా 69 మంది మంత్రులు ఉండగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరో 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే వీలుంది.

కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గిఫ్ట్? – కిషన్ రెడ్డికి ప్రమోషన్:

తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు కూడా ఈ మార్పుల్లో ప్రాధాన్యత దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy)కి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే సిట్టింగ్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి బిజెపి అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv