Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kl Rahul : ఏందయ్యా రాహుల్.. ధోని, రోహిత్, కోహ్లీలు ఉన్న ఎలైట్ జాజితాలోకి..

Kl Rahul : ఏందయ్యా రాహుల్.. ధోని, రోహిత్, కోహ్లీలు ఉన్న ఎలైట్ జాజితాలోకి..

10tv 3 weeks ago
  • రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్
  • ఢిల్లీ విజయంలో కీలక పాత్ర
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం

Kl Rahul : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు.

శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ, రోహిత్, జడేజా, ధోని ఉన్న ఎలైట్ జాబితాలో రాహుల్ చోటు సంపాదించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (90), డోనోవన్ ఫెరీరా (47 నాటౌట్), ధ్రువ్ జురెల్ (42) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, కైల్ జేమీసన్, అక్షర్ పటేల్‌, నటరాజన్ తలా ఓ వికెట్ సాధించారు.

RR vs DC : మ్యాచ్ మధ్యలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల మధ్య వాగ్వాదం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

ఆ తరువాత 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (75; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పాతుమ్ నిస్సాంక (62; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు బాదారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.

ధోని, రోహిత్ ఎలైట్ జాబితా..

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో జడేజాతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ, ధోనిలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

Axar Patel : గత మ్యాచ్ తరువాత ఇద్దరు చనిపోయారు.. ఈ విజయం వారికే అంకితం.. అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు..

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్లు వీరే..

* రోహిత్ శర్మ – 21 సార్లు
* విరాట్ కోహ్లీ – 20 సార్లు
* ఎంస్ ధోని – 18 సార్లు
* రవీంద్ర జడేజా – 17 సార్లు
* కేఎల్ రాహుల్ – 17 సార్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv