Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LGBT Movie : ఎల్‌జీబీటీ పార్ట్ 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయం.. మంత్రి కామెంట్స్..

LGBT Movie : ఎల్‌జీబీటీ పార్ట్ 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయం.. మంత్రి కామెంట్స్..

10tv 1 week ago

LGBT Movie : సామాజిక అంశాల పై సినిమాలను తీసే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఇటీవల శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ట్రాన్స్‌జండర్స్ జీవితాల మీద కోర్ట్ రూమ్ డ్రామాగా "ఎల్‌జిబీటీ - ఏ లీగల్ బ్యాటిల్" అనే సినిమా తీశారు.

ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా 50 డేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ ఈవెంట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తుంది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది. అందుకే ‘ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్ 2’ సినిమా నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము అని అన్నారు.

దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు మా సినిమాను 50 రోజులు ఆదరించి విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలి అని అన్నారు. అలాగే.. గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ అధినేత విమల్ రాజ్ మాథుర్ ఈ సినిమాని హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నామని, పార్ట్ 2 మేమే నిర్మిస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv