Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madhavan-CM Vijay : 'మంచి చేసినా విమర్శలు తప్పవు'.. తమిళ రాజకీయాలపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్

Madhavan-CM Vijay : 'మంచి చేసినా విమర్శలు తప్పవు'.. తమిళ రాజకీయాలపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్

10tv 1 week ago
  • రాజకీయాలకు మాత్రం దూరం అంటున్న స్టార్ హీరో
  • మేం ఇద్దరం స్నేహితులం.. చిరకాల మిత్రుడు ఇప్పుడు సీఎం విజయ్‌
  • రాజకీయాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి

Madhavan- CM Vijay : తమిళనాడులో విజయ్ దళపతి సీఎం అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రోజురోజుకీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చిరకాల మిత్రుడు నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసే మార్పు వస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమిళ రాజకీయాలపై మాధవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విజయ్‌ను ఇప్పుడు 'సీఎం విజయ్' అని పిలవాల్సి వస్తుందని, తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడూ లేదని మాధవన్ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే భావన ఉండాలని, కానీ, పదవి లేదా అధికారం కోసం రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

ఏం చేసినా విమర్శలు తప్పవు :

'రాజకీయాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. మంచి చేసినా విమర్శలు వస్తాయి.. తప్పు చేసినా విమర్శలు ఎదురవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించే వారు ఉంటారు' అని మాదవన్ వ్యాఖ్యానించారు.

మొదటి నుంచి తనకు రాజకీయాలపై సరైన అవగాహన లేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులను గౌరవించడం మాత్రమే తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తనకు చేతనైన విధంగా మంచి పనులు చేస్తూనే ఉంటానని మాధవన్ చెప్పారు.

విజయ్ రాజకీయ ప్రవేశంతో తమిళనాడులో ఆసక్తి పెరుగుతున్న తరుణంలో మాధవన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు స్నేహితుడిపై నమ్మకంగా ఉందనే చెబుతూనే మరోవైపు రాజకీయాలపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేశారు మాధవన్..

సినిమాల విషయానికి వస్తే.. నటుడు మాధవన్ పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘GDN’ మూవీ ఆగస్టు 7న రిలీజ్ కానుంది. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశంలో ఒకప్పటి వలసవాద కాలపు అధికారులతో పోరాడిన కీలక చారిత్రక ఘట్టాల నేపథ్యంతో సాగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv