Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Malla Reddy Biopic: నా బయోపిక్ చేస్తా.. సినిమాల్లోకి ఎంట్రీపై మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..

Malla Reddy Biopic: నా బయోపిక్ చేస్తా.. సినిమాల్లోకి ఎంట్రీపై మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..

10tv 2 weeks ago

Malla Reddy: అనేక విద్యాసంస్థల స్థాపనతో పేరు తెచ్చుకున్న మల్లారెడ్డి అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యారు. ఇక తన స్పీచ్ లతో మరింత పాపులారిటీ సంపాదించి వైరల్ అయ్యారు.

ప్రస్తుతం మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా BRS పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్లారెడ్డికి సినీ పరిశ్రమలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి.

గతంలోనే మల్లారెడ్డి సినిమాల్లోకి వస్తారు అని రూమర్స్ వచ్చాయి. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కూడా ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసారు. తాజాగా మల్లారెడ్డి ఆహా ఓటీటీలో సుధీర్ హోస్ట్ గా వస్తున్న సర్కార్ షోకి హాజరయ్యారు. ఈ షోలో మల్లారెడ్డి తన పంచులతో సందడి చేసారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ గురించి మాట్లాడారు.

మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ రోల్ ఇచ్చాడు హరీష్ శంకర్. కానీ నేను వద్దన్నా. విలన్ గా చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా హీరోని నేను తిడతాను. సెకండ్ హాఫ్ లో హీరో నన్ను కొడతాడు, తిడతాడు. ఇప్పుడు నన్ను కొడితే తిడితే నా స్టూడెంట్స్, ప్రజల ముందు బాగోదు. అందుకే విలన్ పాత్ర చేయలేదు. వేరే ఏదైనా పాత్ర వస్తే ఆలోచిస్తా.

చిరంజీవి నా ఫేవరేట్ హీరో. నేను సినిమాల్లోకి వస్తా. నా బయోపిక్ చేస్తా. డైరెక్టర్ ఏ హీరో అంటే, నా పాత్రకు ఎవరు సరిపోతారు అంటే వాళ్లనే పెడతా హీరోగా. నేను కూడా అందులో నటిస్తా. నా పేరు పెట్టి, నా కథ సినిమా చేస్తే నేనే నిర్మాతగా చేస్తా అని తెలిపారు. దీంతో మల్లారెడ్డి బయోపిక్ త్వరలోనే తెరకెక్కుతుందని, నిర్మాతగా మల్లారెడ్డి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv