Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamitha Baiju : కొత్త గోల్డెన్‌ గర్ల్‌.. వరుస పెట్టి వందల కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్..

Mamitha Baiju : కొత్త గోల్డెన్‌ గర్ల్‌.. వరుస పెట్టి వందల కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్..

10tv 6 days ago

Mamitha Baiju : ఇండస్ట్రీలో హీరోయిన్‌ నెంబర్‌ వన్‌ రేస్‌ గురించి తెలియదు గానీ.. మోస్ట్‌ హ్యాపెనింగ్‌ గోల్డెన్‌ గర్ల్‌గా దూసుకుపోతోంది మమితా బైజు.

బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌తో ఈ ప్రేమలు బ్యూటీ నటించిన సినిమాలు.. నీళ్లు తాగినంత ఈజీగా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కలెక్ట్‌ చేస్తున్నాయి. మొదట్లో మలయాళంలో చాలా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేసింది.

2024 లో ప్రేమలు సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమా హిట్ అవ్వడంతో మమిత ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. దాంతో ఆమెకు ఆఫర్స్ వరుసగా వచ్చాయి. ప్రజెంట్‌ సౌత్‌ ఇండస్ట్రీలో మమితా బైజు పేరు మారుమోగుతోంది. అటు పర్ఫార్మెన్స్‌, ఇటు గ్లామర్‌ పరంగా వరుస విజయాలు అందుకుంటూ గోల్డెన్‌ గర్ల్‌గా సూపర్ ఫామ్‌ చూపిస్తోంది. మమితా నటించిన సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వందకోట్లకిపైగా వసూళ్లు సాధిస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

ప్రేమలు వంద కోట్లు సాధించి హవా మొదలుపెట్టిన మమిత ఆ తర్వాత డ్యూడ్ సినిమాతో హిట్ కొట్టి ఇంకో వంద కోట్ల సినిమా ఖాతాలో వేసుకుంది. ఇటీవల జూలైలో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన దళపతి విజయ్‌ చివరి సినిమా జన నాయగన్‌ లో విజయ్ పెంపుడు కూతురు పాత్రలో నటించి మెప్పించింది మమిత. టాక్‌తో సంబంధం లేకుండా వరల్డ్‌ వైడ్‌గా ఆ సినిమా కూడా 300కోట్లు వసూలు చేసింది.

ఇక ఆగస్ట్‌లోనే విడుదలైన విశ్వనాథ్ అండ్‌ సన్స్ సినిమాతో మమితా బైజు ఖాతాలో 200కోట్ల బ్లాక్‌బాస్టర్‌ చేరింది. ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో సూర్యని సైతం డామినేట్ చేసి మెప్పించింది. ప్రస్తుతం మలయాళ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోన్న బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా కూడా 200కోట్ల మార్క్‌ దిశగా దూసుకుపోతోంది. మమితా బైజు నటించిన ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.

నివిన్‌ పౌలీ, మమితా బైజు జోడీగా నటించిన బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా ఓనం సందర్భంగా ఈ నెల 21న మలయాళంలో రిలీజయి 6 రోజుల్లోనే 100కోట్లకిపైగా వసూళ్లు సాధించి సెస్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. మొత్తానికి మమిత వరుస సినిమాలు హిట్స్ కొడుతూ వరుసగా 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అనిపించుకుంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv