Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Matsyakarula Sevalo : వారికి AP సర్కార్ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు..

Matsyakarula Sevalo : వారికి AP సర్కార్ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు..

10tv 5 days ago
  • మత్స్యకార కుటుంబాలకు శుభవార్త
  • నేడు మత్స్యకారుల సేవలో నిధులు విడుదల
  • ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.20 వేలు

Matsyakarula Sevalo : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయడం లేదు.

ఈ క్రమంలో తాజాగా నేడు ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.20 వేలు జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఇది ఏ పథకం అంటే.. 'మత్స్యకారుల సేవలో'. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ. 20 వేలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. మరి ఈ ఆర్థిక సాయం ఎందుకంటే.. సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించడంతో.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వేట నిషేధ భృతిగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేయనున్నారు.. కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షలో పాల్గొంటారు.

రాష్ట్రంలో మత్స్య సంపద పెంచేందుకు గాను ప్రతి సంవత్సరం.. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులపాటు సముద్రంలో వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం కూటమి ప్రభుత్వం కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య 1,30,796కి పెరిగింది. రెండేళ్లలో మత్స్యకారుల కుటుంబాలకు రూ.505 కోట్లు సాయంగా అందించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv