Dailyhunt
Middle East War: పండుగ చేసుకోండి.. పెట్రోల్, డీజిల్ దెబ్బతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆరోజు నుంచే ఆరంభం..

Middle East War: పండుగ చేసుకోండి.. పెట్రోల్, డీజిల్ దెబ్బతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆరోజు నుంచే ఆరంభం..

10tv 1 week ago
  • పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో పెట్రోల్, డీజిల్ సంక్షోభం
  • ముందస్తు చర్యలు ప్రారంభించిన పలు దేశాలు
  • మలేసియాలో ఏప్రిల్ 15 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్
  • పెట్రోల్, డీజిల్ కోటా ప్రకారం (నెలకు 200 లీటర్లు) ఇవ్వాలని నిర్ణయం
  • చైనాలో విమానయాన ఇంధనం ధరలు పెరుగుదల
  • వియాత్నాంలో రిమోట్ వర్క్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  • పాకిస్తాన్ లో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు

Middle East War: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది. ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు దేశాలను తీవ్రమైన ఇంధన కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల మీద అత్యంత ఎక్కువ ప్రభావం ఉంది. ఓవైపు క్రూడాయిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి, మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. సంక్షోభం మరింత ముదరకుండా ముందస్తు చర్యలు ప్రారంభించాయి. మలేషియా కీలక నిర్నయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పెట్రోల్, డీజిల్ కూడా అడిగినంత కాకుండా కోటా ప్రకారం (నెలకు 200 లీటర్లు) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

అటు డ్రాగన్ దేశం చైనాలోనూ ఫ్యూయల్ కష్టాలు మొదలయ్యాయి. అక్కడ విమానయాన ఇంధనం ధరలు పెరిగాయి. పెరిగిన రేట్లకు అనుగుణంగా విమాన టికెట్ రేట్ల పెంచారు. విమానయాన సంస్ధలు ప్రయాణికులపై భారం మోపుతున్నాయి. ఈ ప్రభావం చైనాకే కాకుండా ఇతర దేశాలపై పడే ప్రమాదం ఉంది.

ఇక, వియాత్నాం ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. కంపెనీలు కూడా రిమోట్ వర్క్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. మన పొరుగు దేశం పాకిస్తాన్ లో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేశారు. వారంలో నాలుగు రోజులు ఆఫీసులో పని, మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మయన్మార్ లో సరి – బేసి వాహనాల విధానం అమలు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv