Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Missing Meghana : 'మిస్సింగ్ మేఘన' నుంచి సూపర్ మెలోడీ సాంగ్ విన్నారా..

Missing Meghana : 'మిస్సింగ్ మేఘన' నుంచి సూపర్ మెలోడీ సాంగ్ విన్నారా..

10tv 3 weeks ago

Missing Meghana : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో వాచస్పతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని.. పలువురు ఈ సినిమాలో కెలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా తాజాగా రెండో పాటని రిలీజ్ చేసారు. స్టార్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా మిస్సింగ్ మేఘన సినిమాలోని 2వ సాంగ్ ను రిలీజ్ చేసారు. విన్నావా విన్నావా.. అనే ఈ పాటను RR ధృవన్ రాసి సంగీతం అందించగా సింగర్ దీపు పాడారు.

మీరు కూడా మిస్సింగ్ మేఘన సినిమా నుంచి వచ్చిన ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి..

ఈ సాంగ్ లాంచ్ అనంతరం దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాలు ఇచ్చి పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో రెండో పాట రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ థ్రిల్లర్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది అని తెలిపారు. సంగీత దర్శకుడు ధృవన్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారికి మ్యూజిక్ లో మంచి టేస్ట్ ఉంది. ఆయన సినిమాలలోని పాటలు హిట్ అవుతాయి. రాజు గారు మా పాట విని చాలా బాగుంది అన్నారని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv