Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Motorola Signature Price : మోటోరోలా మజాకా.. ఈ కొత్త సిగ్నేచర్ ఫోన్ ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

Motorola Signature Price : మోటోరోలా మజాకా.. ఈ కొత్త సిగ్నేచర్ ఫోన్ ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

10tv 2 weeks ago
  • భారత్‌లో మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 57,499 ధరకు లభిస్తోంది
  • రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Motorola Signature Price : మోటోరోలా అభిమానులకు పండగే.. రూ. 55వేల లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్..ఈ ఏడాది ప్రారంభంలో రూ. 59,999 ధరకు లాంచ్ అయిన మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ. 8వేల వరకు తగ్గింపుతో లభిస్తోంది.

ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కోరుకునే యూజర్లకు మోటోరోలా సిగ్నేచర్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆఫర్లు (Motorola Signature Price) ఎక్కువ రోజులు ఉండవు. మీకు కొనాలని ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ ఆఫర్ వివరాలు, ఎలా తక్కువ ధరకే పొందాలో ఇప్పుడు చూద్దాం..

మోటోరోలా సిగ్నేచర్ డీల్ :
భారత మార్కెట్లో మోటరోలా సిగ్నేచర్ ఫోన్ రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 57,499కే లభిస్తోంది. దీనికి అదనంగా, మీరు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 5,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా సిగ్నేచర్ 6.8-అంగుళాల అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ మోటోరోలా ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

దీనికి 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. 5200mAh బ్యాటరీ కూడా ఉంది. దీనికి 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
మోటోరోలా సిగ్నేచర్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో 50MP మెయిన్ కెమెరా, 100x సూపర్ జూమ్ 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కూడా ఉంది.

కొనాలా? వద్దా? :
మోటోరోలా సిగ్నేచర్ అనేది అత్యంత కంపర్టబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. చాలా పలుచగా తేలికగా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 165Hz డిస్‌ప్లే పెరిస్కోప్ టెలిఫోటోతో మల్టీఫేస్ ట్రిపుల్ 50MP కెమెరా ఉన్నాయి. అలాగే 5,200mAh బ్యాటరీ కూడా ఉంది. ఒక రోజు కన్నా ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది. తగ్గింపు ధరతో మీరు ఈ మోటోరోలా ఫోన్‌ కొనేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv