Dailyhunt
MS Dhoni : సీఎస్‌కే పై ధోని అసంతృప్తి? జడేజానే కారణమా? ఐపీఎల్‌లో ధోని అందుకే ఆడడం లేదా?

MS Dhoni : సీఎస్‌కే పై ధోని అసంతృప్తి? జడేజానే కారణమా? ఐపీఎల్‌లో ధోని అందుకే ఆడడం లేదా?

10tv 2 weeks ago
  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే
  • ఒక్క మ్యాచ్ ఆడని ధోని
  • సీఎస్‌కే పై అసంతృప్తిలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు

MS Dhoni : ఐపీఎల్ 2026 మహేంద్ర సింగ్ ధోని ఆట చూద్దామని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది.

ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేటు -0121గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో సీఎస్‌కే మరో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కనీసం ఈ మ్యాచ్‌ల్లోనైనా ధోని ఆడతాడా ? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రోజు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోని పిక్క గాయంతో బాధపడుతున్నాడని తొలి రెండు వారాల పాటు ఆడలేడని సదరు వార్తల సారాంశం. అయితే.. రెండు వారాలు సమయం ముగిసినప్పటికి కూడా ధోని మ్యాచ్‌లు ఆడడం లేదు.

Kyle Jamieson : ఆరడుగులు ఉన్నావ్‌.. 15 ఏళ్ల పిల్లాడితో ఏంటి అలా.. దడుచుకుంటే ఎవరిది బాధ్యత..

దీనిపై ఇటీవల సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ చేస్తుండగా మరోసారి అదే ప్రాంతంలో గాయమైందన్నాడు. అందుకనే అతడి విషయంలో తొందర పడడం లేదని, ఎప్పుడు ఆడతాడు అనే విషయం పై ఖచ్చితమైన తేదీ వెల్లడించలేమన్నాడు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీని ప్రకారం ధోని ఆడకపోవడానికి రవీంద్ర జడేజానే కారణం అని సదరు వార్త సారాంశం. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో సంజూ శాంసన్‌ను తీసుకునేందుకు రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌ను సీఎస్‌కే వదులుకుంది. జట్టులో కొన్నాళ్లుగా కీలక ఆటగాడిగా ఉన్న జడేజాను సీఎస్‌కే వదిలి వేయడంపై ఆ జట్టు అభిమానులతో పాటు క్రికెట్ పండితులు ఆశ్చర్యపోయారు.

Axar Patel : గత మ్యాచ్ తరువాత ఇద్దరు చనిపోయారు.. ఈ విజయం వారికే అంకితం.. అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు..

ధోనితో జడ్డూకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో సీఎస్‌కే నిర్ణయం పట్ల ధోని సంతృప్తిగా లేడని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫ్రాంచైజీ నిర్ణయం జడేజాతో ధోని సంబంధాలను ప్రభావితం చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ధోని సీఎస్‌కే మ్యాచ్‌లకు హజరు కావడం లేదని చెబుతున్నారు. అయితే.. దీనిపై అటు ధోని కానీ, ఇటు సీఎస్‌కే స్పందించలేదు. ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు నిజం ఏంటి అనేది తెలియదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv