Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాకు మూడు నెలలు చాన్స్ ఇవ్వు.. సీఎం రేవంత్ కు హరీశ్ సవాల్..

నాకు మూడు నెలలు చాన్స్ ఇవ్వు.. సీఎం రేవంత్ కు హరీశ్ సవాల్..

10tv 6 days ago

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నాడు..

ఈ సందర్భంగా ఆయనకు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. రేవంత్ నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు. ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్లు ఎలా తేవాలో నేను చూపిస్తా అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు.

పొట్టిగా ఉన్నోనికి.. పొడుగోన్ని చూస్తే జెలసీ ఉంటుంది. నీకు మెదడు లేదు రేవంత్ అంటూ హరీశ్ రావు విమర్శించారు. నేను తాటిచెట్టులాగా పెరిగాను అంటున్నాడు.. దానికి నేను ఉమి చెయ్యాలి.. దేవుడు నిన్ను ఇప్ప చెట్టులాగా పొట్టిగా పుట్టించాడు. ఎల్‌నినో వచ్చింది.. నీళ్లులేవు, వర్షాలు లేవు. మోటార్లు ఎక్కడ ఆన్ చెయాలి అని రేవంత్ అంటుండు.. మేడిగడ్డ దగ్గర 89వేల 230 క్యూసెక్కుల నీళ్లు ఈ క్షణానికి ప్రవహిస్తున్నాయి. వానపడ్డా.. పడకున్నా.. మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి. అందుకే కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు కట్టిండు. తెలంగాణ కోసం నీళ్లను ఒడిసి పట్టకుండా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం, ఆంధ్రా కోసం రేవంత్ రెడ్డి నీళ్లు వదిలిపెడుతున్నాడు. నీళ్లు ఉన్నాయి.. నీళ్లు లేవంటున్న రేవంత్.. మరి ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.

రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరివేసినా తప్పులేదు. నదులల్లో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్న.. నీళ్లుండి మోటార్లు నడపకపోవడం ఏమనాలి అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. నీళ్ల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. దేవాదుల దగ్గర మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదు..? ఇక్కడ ఎన్డీఎస్ఏ ఇంకా వేరే అభ్యంతరాలు లేవు కదా రేవంత్? కట్టిన ఇళ్ళు.. పెట్టిన పొయ్యిలాగా కేసీఆర్ అన్నీ చేశాడు.. అయినా కాంగ్రెస్ ఏమీ చేయట్లేదు. రేవంత్ నువ్వు నిన్న చెప్పిన ప్రతి ఒక్కొక్క అబద్ధానికి.. ఒక్కొక్క అక్షరానికి సమాధానం చెబుతా ఆధారాలతో సహా బయటపెడుతా అని హరీశ్ రావు అన్నారు.

తుమ్మడిహట్టి వద్ద అన్ని అనుమతులు కాంగ్రెస్ తెచ్చింది అంటున్న రేవంత్ రెడ్డి.. అనుమతి కాఫీని బయట పెట్టాలి. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్నట్టు డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు రేవంత్.. నేను రాజీనామా చేస్తా అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు. అనుమతి కాఫీ లేదంటే బయటకు వచ్చి తప్పయిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు.. రాజకీయాలకోసం మాట్లాడాను అని ఒప్పుకో. మీరు అనుమతులు తెస్తే 2013లో మహారాష్ట్ర సీఎం పద్నవీస్ అనుమతి ఇవ్వమని లేఖ ఎందుకు రాశారు? సీఎం రేవంత్ రెడ్డి తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అంటే కరెక్షన్… కరెప్షన్ అంటే కాంగ్రెస్ అంటూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv