Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nagarjuna : అసలు అఖిల్ ఈ సినిమాకు సెట్ అవుతాడా అని భయం వేసింది.. నాగార్జున కామెంట్స్ వైరల్..

Nagarjuna : అసలు అఖిల్ ఈ సినిమాకు సెట్ అవుతాడా అని భయం వేసింది.. నాగార్జున కామెంట్స్ వైరల్..

10tv 5 days ago

Nagarjuna : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా 'లెనిన్'. ఈ సినిమా జులై 10న రిలీజ్ కానుంది. నేడు అఖిల్ లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ సినిమా శ్రీరామపురంలో జరుగుతుంది అన్నాడు. అది మా నాన్న పుట్టిన ఊరు అంటే అది కృష్ణ జిల్లా. ఇది చిత్తూరు అని చెప్పాడు. కానీ పేరు ఒకటే. నాకు అది సెంటిమెంట్ అనిపించింది. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ లు ఎంత అనుకున్నా ఊహించలేరు. ప్రేమ అనే దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ఒక ప్రేమ కథ ఇది. భాగ్యశ్రీ భారతి పాత్రలో లెనిన్ కి హార్ట్ బీట్. శివాజీ మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే వచ్చాడు. బ్రహ్మాజీ శివ చైన్ తో మొదలైంది మా జర్నీ. సునీల్ తో చాలా సినిమాలు చేసాము. వీళ్లంతా అఖిల్ సినిమాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది.

నాగవంశీ ని మీ అందరూ చింటూ అన్న అంటారుగా. చింటూ అన్న నాకు, అఖిల్ కి ఈ సినిమా అంతా సపోర్ట్ గా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే చింటూ ఈ సినిమాని ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. లెనిన్ సీమ మట్టి, మనుషుల కథ. సీమలో జరుగుతున్న మహాభారతం. అఖిల్ ఇప్పటివరకు అన్ని అర్బన్ సినిమాలు చేసాడు. ఈ సినిమా మొదలైనప్పుడు అసలు సెట్ అవుతాడా, చేస్తాడా అని భయం వేసింది. కానీ సినిమా చూసిన తర్వాత నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. మీరు సినిమా చూసాక లెనిన్ స్నేహం, పగని ప్రేమిస్తారు. జులై 10 వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు అని అన్నారు.

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv