Dailyhunt
Nicholas Pooran : ముంబైతో మ్యాచ్‌లో నికోలస్ పూరన్ విధ్వంసం.. బుడ్డోడిని అధిగమించిన వెస్టిండీస్ వీరుడు

Nicholas Pooran : ముంబైతో మ్యాచ్‌లో నికోలస్ పూరన్ విధ్వంసం.. బుడ్డోడిని అధిగమించిన వెస్టిండీస్ వీరుడు

10tv 1 week ago
  • ఎట్టకేలకు ఫామ్ అందుకున్న నికోలస్ పూరన్
  • 16 బంతుల్లో హాఫ్ సెంచరీ

Nicholas Pooran : ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.

సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతులను ఎదుర్కొని 1 ఫోర్‌, 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. అతడు కేవలం 16 బంతుల్లోనే అర్థశతకాన్ని సాధించాడు.

ఈ క్రమంలో అతడు వైభవ్ సూర్యవంశీని అధిగమించాడు. ఐపీఎల్‌లో 20 బంతుల లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో చోటు సంపాదించాడు. వైభవ్ నాలుగు సార్లు ఈ ఘనత సాధించగా నికోలస్ పూరన్ ఐదు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో అభిషేక్ శర్మ అత్యధికంగా ఆరు సార్లు ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్‌లో 20 బంతుల లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు ప్లేయర్లు వీరే..

* అభిషేక్ శర్మ – 6 సార్లు
* నికోలస్ పూరన్ – 5 సార్లు
* వైభవ్ సూర్యవంశీ – 4 సార్లు

లక్నో తరుపున వేగవంతమైన హాఫ్ సెంచరీ..

పూరన్ ది లక్నో తరుపున రెండో వేగవంతమైన హాప్ సెంచరీ. ఇక వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా పూరన్ పేరిటే ఉంది. 2023లో ఆర్‌సీబీ పై అతడు 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

BCCI : ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ పై బీసీసీఐ ఆగ్రహం.. త్వరలోనే కొత్త నిబంధనలు..!

లక్నో తరుపున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..

* నికోలస్ పూరన్ – 15 బంతులు (ఆర్‌సీబీపై 2023లో)
* నికోలస్ పూరన్ – 16 బంతులు (ముంబైపై 2026లో)
* నికోలస్ పూరన్ – 18 బంతులు (సన్‌రైజర్స్ పై 2025లో)
* నికోలస్ పూరన్ – 19 బంతులు (ముంబై పై 2024లో)
* కైల్ మేయర్స్ – 20 బంతులు (పంజాబ్ పై 2023లో)
* నికోలస్ పూరన్ – 20 బంతులు (ఢిల్లీపై 2024లో)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv