- మంగళవారం అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్
- ఢిల్లీ బ్యాటర్ నితీశ్ రాణా ఔట్ పై వివాదం
- రూల్స్ ప్రకారం ఆ బంతి డెడ్ బాలా?
Nitish Rana : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్ రాణా ఔటైన తీరుపై వివాదం చెలరేగుతోంది.
మంగళవారం అరుణ్‌జైట్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణా ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు అతడు ఔట్ కాదని, మరికొందరు మాత్రం అతడు ఔట్ అంటూ డిబేట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
అరుణ్‌జైట్లీ వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్‌లో నితీశ్ రాణా బరిలోకి దిగాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను సీఎస్‌కే బౌలర్ నూర్ అహ్మద్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతిని రాణా డీప్ ఫైన్‌లెగ్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కార్తీక్ శర్మ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఇంత వరకు అంతా బానే ఉంది గానీ.. నితీశ్ రాణా బంతిని కొట్టే సమయంలో బెయిల్స్ కిందపడ్డాయి.
HBD Sanjana Ganesan : స్పోర్ట్స్ ప్రెజెంటర్ బర్త్ డే.. మై లవ్ అంటూ బుమ్రా విషెస్.. ఫోటోలు వైరల్..
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. కొందరు నితీశ్ రాణా హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడని అంటుండగా, మరికొందరు మాత్రం శాంసన్ అనుకోకుండా స్టంప్స్‌ను తాకాడని అందుకనే బెయిల్స్ పడ్డాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ సమయంలో స్టేడియంలో బలమైన గాలులు వీచాయని వాటికారణంగానే బెయిల్స్ పడ్డాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నాయి.
డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు?
వాస్తవంగా మ్యాచ్‌లో బ్యాటర్ నేరుగా లేదంటే అతడికి సంబంధించిన వస్తువులు వికెట్లను తాకి బెయిల్స్ కిందపడితే అప్పుడు అతడు హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకుంటాడు. తాజాగా ఘటనలో అలాంటిది ఏమీ జరగలేదు. పోనీ వికెట్ కీపర్ ఏమన్నా చేశాడా? అది కూడా లేదు.
నిజం చెప్పాలంటే క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి వేయకముందు స్టంప్స్ పడితే అప్పుడు ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా పరిగణించాల్సి వస్తుంది. కానీ బంతి ఆటలోకి వచ్చాక, బ్యాటర్ నుంచి ఎలాంటి వ్యతిరేకత లేనప్పుడు డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సిన అవసరం లేదు.

