Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nothing Phone 3 Price : వారెవ్వా.. ఆఫర్ అదిరింది.. ఈ నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంతంటే?

Nothing Phone 3 Price : వారెవ్వా.. ఆఫర్ అదిరింది.. ఈ నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంతంటే?

10tv 4 days ago
  • నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన ఆఫర్
  • అమెజాన్‌లో ఈ నథింగ్ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్
  • అసలు ధరపై ఏకంగా రూ. 37వేలు ఆదా చేయొచ్చు

Nothing Phone 3 Price : కొత్త నథింగ్ ఫోన్ కొంటున్నారా?

మీకోసం నథింగ్ ఫోన్ 3 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 79,999 ఉండగా అమెజాన్ ద్వారా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ నథింగ్ ఫోన్ కేవలం రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. తద్వారా అసలు ధరపై రూ. 37వేలు ఆదా చేయొచ్చు.

ఆఫర్ల ద్వారా మరిన్ని డిస్కౌంట్లు, బ్యాంకుల నుంచి ఎక్స్ఛేంజ్ (Nothing Phone 3 Price) ఆఫర్లను కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ కొనేందుకు ఇదే సరైన సమయం. అమెజాన్‌లో ఈ నథింగ్ ఫోన్ 3 కొనేముందు పూర్తి ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..

నథింగ్ ఫోన్ 3 అమెజాన్ డీల్ :
నథింగ్ ఫోన్ 3 ఫోన్ ప్రారంభ ధరపై రూ. 37వేల తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 42,999కి అమ్ముడవుతోంది. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే.. ప్రైమ్ సభ్యులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర కొనుగోలుపై 3 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

అమెజాన్ నెలకు రూ. 1,512 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్ ఏదైనా ఉంటే.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ. 38,900 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఫైనల్ వాల్యూ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. HDR10+ కస్టమైజ్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది.

ఈ ప్యానెల్ గరిష్టంగా 4,500 నిట్స్ చేరుకోగలదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. నథింగ్ ఫోన్ 3 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ 5,500mAh సామర్థ్యంతో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. మూడు 50MP రియర్ సెన్సార్లు లభిస్తాయి. మెయిన్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫొటో, అల్ట్రావైడ్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50MP ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం అద్భుతంగా ఉంటుంది.

ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
ఈ నథింగ్ ఫోన్ 3 రూ. 45వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఇంతకన్నా తక్కువ ధరలో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో, ఐక్యూ 15ఆర్ వంటి ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv