Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR : అయ్యప్పగా ఎన్టీఆర్.!?

NTR : అయ్యప్పగా ఎన్టీఆర్.!?

10tv 1 week ago

NTR : రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఇప్పుడో గాసిప్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ముఖ్యంగా అయ్యప్ప స్వామి పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే టాక్ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

కథలో కీలకమైన టైమ్‌లో అయ్యప్ప స్వామి రూపంలో ఒక పవర్‌ఫుల్ ఎంట్రీ ఉంటుందని, ఆ పాత్రకు సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్‌ ఉండటంతో మేకర్స్ స్టార్ హీరో అయితే హైప్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లొచ్చని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే అయ్యప్ప రోల్‌ కోసం ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇరుముడి మూవీలో ఎన్టీఆర్‌ రోల్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయపోయినా..ఈ గాసిప్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. రవితేజ ఎనర్జీకి తోడు, ఎన్టీఆర్ వంటి స్టార్ క్యామియో ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్లే అవకాశముందన్న అంచనాలున్నాయి.

Esther anil : బ్లాక్ కలర్ శారీలో క్యూట్ స్మైల్‌తో దృశ్యం పాప.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఎస్తర్ అందాలు

ఇక ఇప్పటికే డివోషనల్ టచ్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఎన్టీఆర్ రోల్ నిజమైతే భారీ క్రేజ్ తెచ్చుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అయ్యప్ప మాల, ఆధ్యాత్మికత, బలమైన ఎమోషనల్ కంటెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రవితేజ కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన ప్రయత్నం కావడంతో, ఆయనను సరికొత్త కోణంలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv