Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Oppo F35 Series : ఒప్పో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త ఒప్పో F35 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

Oppo F35 Series : ఒప్పో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త ఒప్పో F35 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

10tv 1 week ago
  • వచ్చే నెలలో భారత్‌లో ఒప్పో F35 సిరీస్ లాంచ్
  • ఒప్పో ఫైండ్ X9s ప్రో కూడా త్వరలో రానుంది
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పో F33 5జీ సిరీస్

Oppo F35 Series : ఒప్పో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా?

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త ‘F’ సిరీస్ వచ్చే నెలలో రాబోతుంది. ఒప్పో F35 సిరీస్ వివరాలు ముందే లీక్ అయ్యాయి. ఒప్పో ఫైండ్ X9s ప్రో కూడా త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ల లాంచ్ సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

నివేదికల ప్రకారం.. ఒప్పో F35 సిరీస్ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ కావొచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఒప్పో ఫైండ్ X9s ప్రో కూడా త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కావొచ్చు.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)తో సహా సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టు కాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి. ఒప్పో F33 5జీ, ఒప్పో F33 ప్రో 5జీ ఫోన్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ టాప్ బ్రైట్ నెస్, 6.57-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్, మాలి-G57 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్16పై రన్ అవుతుంది.

ఒప్పో F33 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఒప్పో F33 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.57-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మాక్స్ చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv