Dailyhunt
PAN Card Rules 2026 : పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆధార్ ఉన్నా PAN ఇవ్వరు.. ఈ గైడ్‌లైన్స్ తెలియకపోతే నష్టపోయేది మీరే..!

PAN Card Rules 2026 : పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆధార్ ఉన్నా PAN ఇవ్వరు.. ఈ గైడ్‌లైన్స్ తెలియకపోతే నష్టపోయేది మీరే..!

10tv 2 weeks ago
  • పాన్ కార్డు 2026 కొత్త రూల్స్ గురించి మీకు తెలుసా?
  • కేవలం ఆధార్ కార్డుతో ఇక పాన్ కార్డు పొందలేరు
  • పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?
  • ఏయే అవసరాలకు పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలంటే?

PAN Card Rules 2026 : మీకు పాన్ కార్డు ఉందా? కొత్త పాన్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్నారా? ఇది మీకోసమే.. ఏప్రిల్ నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై పాన్ కార్డు పొందడం అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనలను అప్‌డేట్ చేసింది.

ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇందులో కొత్త ఫారాలు, కఠినమైన డాక్యుమెంటేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి మార్పులు ఉన్నాయి. భారత పౌరులు, కంపెనీలు ఇప్పుడు ఫారం 93ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మునుపటి ఫారం 49A స్థానంలో వచ్చింది. ప్రవాసులు ఫారం 49AAకు బదులుగా ఫారం 95ను ఉపయోగించాలి.

ఇకపై ఆధార్‌ ఒక్కటే సరిపోదు :
కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం మీ ఆధార్ కార్డుతో పాన్ పొందడం ఇకపై కుదరదు. మీరు దరఖాస్తు చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుతో పాటు అదనపు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీ పాన్ కార్డుపై ఉన్న పేరు, మీ ఆధార్ కార్డుపై ఉన్న పేరుతో ఎలాంటి మార్పులు లేదా తేడాలు లేకుండా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి :
ఏప్రిల్ 1, 2026 నుంచి దరఖాస్తు చేసేటప్పుడు పుట్టిన తేదీ (DOB)కి సంబంధించిన వ్యాలీడ్ ప్రూఫ్ అవసరం. ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.

  • జనన ధృవీకరణ పత్రం
  • ఓటరు గుర్తింపు కార్డు
  • 10వ తరగతి మార్కుల షీట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాస్‌పోర్ట్
  • మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్
  • ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు

పాన్ కార్డు కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
1. అధికారిక NSDL లేదా UTIITSL వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. సరైన ఫారమ్‌ను ఎంచుకోండి. ఫారమ్ 93 (భారత దరఖాస్తుదారులు) లేదా ఫారమ్ 95 (ప్రవాస పౌరుల కోసం)
3. మీ వ్యక్తిగత సమాచారాన్ని నింపండి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్
4. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ వివరాలను అందించండి.
5. అవసరమైన డాక్యుమెంట్లు (ఆధార్, పుట్టిన తేదీ రుజువు) అప్‌లోడ్ చేయండి.
6. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించండి.
7. మీ దరఖాస్తును సమర్పించి అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను దగ్గర ఉంచుకోండి.
8. మీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ వచ్చాక మీ పాన్ కార్డు పొందవచ్చు.

ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త పాన్ నిబంధనలు అమల్లోకి :
క్యాష్ డిపాజిట్ లిమిట్స్ : గతంలో ఒకే రోజులో రూ. 50,000 మించిన క్యాష్ డిపాజిట్ల కోసం పాన్ కార్డ్ అవసరం ఉండేది. ఈ పరిమితిని ఇప్పుడు వార్షిక పరిమితిగా సవరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్లు రూ. 10 లక్షలు దాటితే పాన్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి.

వాహనాల కొనుగోలు, అమ్మకం : గతంలో ఏ వాహనాన్ని టూవీలర్ సహా కొనుగోలు లేదా విక్రయించినా పాన్ (PAN) అవసరం పడేది. ఇప్పుడు, రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఖరీదు చేసే వాహనాలకు మాత్రమే పాన్ అవసరం అవుతుంది.

హోటల్, రెస్టారెంట్ పేమెంట్లు : గతంలో రూ. 50వేలు పైబడిన చెల్లింపులకు పాన్ (PAN) అవసరమయ్యేది. ఈ పరిమితిని ఇప్పుడు రూ. లక్షకు పెంచారు.

స్థిరాస్తి : గతంలో, రూ. 10 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తికి పాన్ (PAN) అవసరం ఉండేది. ఇప్పుడు, ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.

ఇన్సూరెన్స్ పాలసీలు : గతంలో రూ. 50వేలు దాటిన ప్రీమియంలకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. కొత్త నిబంధనలతో ఇతర భీమా సంబంధిత లావాదేవీలకు కూడా పాన్‌ తప్పనిసరి కానుంది. ఈ కొత్త నిబంధనలతో కచ్చితమైన ఆదాయాన్ని రిపోర్టు చేయడం, పన్ను ఎగవేతను నివారించడం, భారీ లావాదేవీలను మానిటరింగ్ చేసేందుకు ఆదాయపు పన్ను విభాగానికి వీలుంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv