Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్సంటేజీ ఇస్తేనే పెద్ది అయినా ఏదయినా.. ప్రొడ్యూసర్లకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

పర్సంటేజీ ఇస్తేనే పెద్ది అయినా ఏదయినా.. ప్రొడ్యూసర్లకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

10tv 1 week ago
  • నిర్మాతల విమర్శలపై ఎగ్జిబిటర్ల ఘాటు స్పందన
  • పర్సంటేజ్ విధానంపై సుదీర్ఘ కాలం పోరాటం
  • ఫిలిం ఛాంబర్ సమావేశంలో కీలక నిర్ణయం

Tollywood: తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి, ఇటీవల నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై తమ స్పందనను తెలియజేసింది.

నగరంలోని ప్రధాన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున హాజరైన ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా వివాదానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు నిర్మాతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

పరిశ్రమలో థియేటర్ల మనుగడకు సంబంధించిన ‘పర్సంటేజ్ విధానం’పై తాము 2008 నుంచి నిరంతరాయంగా పోరాడుతున్నామని ఎగ్జిబిటర్లు గుర్తుచేశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం ఉండాలని తాము కోరుకుంటున్నామని, నిర్మాతలు ఎప్పుడు చర్చలకు పిలిచినా(Tollywood) తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తామని మీడియా సాక్షిగా వెల్లడించారు.

వ్యాపార పరంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు రేపు ఫిలిం ఛాంబర్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లందరూ కలిసి ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, థియేటర్ల మనుగడను కాపాడుతూనే నిర్మాతల సమస్యలపై కూడా దృష్టి సారిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv