- నెగెటివిటీపై పెద్ది టీమ్ సీరియస్ యాక్షన్
- ఇద్దరు నెటిజన్లపై పోలీస్ కేసులు నమోదు
- పైరసీ అడ్డుకునేందుకు హైకోర్టు ఆదేశాలు
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని చిత్ర బృందం తీవ్రంగా పరిగణించింది.
సినిమాపై టార్గెటెడ్ నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో గుంటూరుకు చెందిన అజయ్ నిమ్మగడ్డ, కూకట్‌పల్లికి చెందిన వినోద్ యాదవ్‌లపై కేసులు నమోదయ్యాయి. పలువురు ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ చిత్రంపై పనిగట్టుకుని నెగెటివిటీని ప్రచారం చేస్తున్నట్లు మేకర్స్ గుర్తించారు.
ఈ సోషల్ మీడియా నెగెటివిటీతో పాటు, పెద్ది సినిమా విడుదల తర్వాత పైరసీకి పాల్పడతామంటూ కొందరు బెదిరింపులకు (పైరసీ థ్రెట్స్) దిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై సైబర్ అధికారుల సహాయంతో రంగంలోకి దిగిన చిత్ర యూనిట్, ఇప్పటికే సదరు వివాదాస్పద యాక్టివిటీకి కారణమైన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించింది. ‘పెద్ది (Peddi)’ టీమ్ ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న ప్రతి కదలికను నిశితంగా గమనిస్తోంది.
నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న మరికొంత మంది ప్రొఫైల్స్, పేర్ల జాబితాను కూడా చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ అధికారులకు అందజేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు నుండి యాంటీ-పైరసీ ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా పొందిన 'పెద్ది' బృందం, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

