Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Piracy: 'పెద్ది' పైరసీకి నో ఛాన్స్.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

Peddi Piracy: 'పెద్ది' పైరసీకి నో ఛాన్స్.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

10tv 3 weeks ago
  • ‘పెద్ది’ సినిమాకు యాంటీ-పైరసీ ఇంజంక్షన్.
  • మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు.
  • లీకుల భయం లేకుండా విడుదల.

Peddi Piracy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది(Peddi)' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా.. తాజాగా ఈ చిత్రానికి పైరసీ ముప్పు తప్పించేందుకు చిత్ర యూనిట్ ఒక కీలకమైన ముందడుగు వేసింది. 'పెద్ది' సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేలా మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ తాజాగా ఒక పటిష్టమైన 'యాంటీ-పైరసీ ఇంజంక్షన్' మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

సినిమా అనధికారికంగా ఇంటర్నెట్‌లో లీక్ అయితే నిర్మాణ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో కోర్టు ఈ రక్షణ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం 'పెద్ది' సినిమాను ఇంటర్నెట్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, కాపీ చేయడం లేదా ప్రసారం చేయడం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ పైరసీ సైట్లను బ్లాక్ చేసినా, వారు కొత్త యూఆర్‌ఎల్‌తో (URL) మళ్లీ రాకుండా ఆటోమేటిక్‌గా కొత్త సైట్‌లను కూడా నిరోధించేలా కోర్టు ఈ 'డైనమిక్ ఇంజంక్షన్' ఆర్డర్‌ను జారీ చేయడం విశేషం.

ఇటీవల దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' చిత్రం విడుదలకు ముందే నెట్టింట లీక్ అయి ఇండస్ట్రీని కుదిపేసింది. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వకుండా 'పెద్ది' మేకర్స్ ముందే కోర్టును ఆశ్రయించి న్యాయపరమైన రక్షణ పొందడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఇచ్చిన ఈ కీలక ఆర్డర్‌తో పైరసీ భూతానికి చెక్ పడినట్లయింది. ఎలాంటి లీకుల భయం లేకుండా 'పెద్ది' చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించడానికి లైన్ క్లియర్ అయ్యింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv