Peddi : రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంతో వస్తున్న పెద్ది మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ది మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది.
పెద్ది టికెట్ రేట్ల పెంపుపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సాధారణంగా రేట్లు పెంచడం అనేది సాధారణ ట్రెండ్. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే టికెట్ రేట్లు పెంచితే ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇటీవల కొన్ని సినిమాలు హైటికెట్ రేట్ల వల్లే ఓపెనింగ్స్‌లో వెనకబడ్డాయని చెబుతున్నారు. అందుకే టికెట్ రేట్స్ విషయంలో పెద్ది టీమ్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. భారీ ఖర్చులు ఉన్నప్పటికీ, టికెట్ రేట్లు పెంచడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికే ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

