Peddi – Ibomma: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్ అంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తుంది. గతేడాది నవంబర్‌లో ఐబొమ్మ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత సైట్ పూర్తిగా క్లోజ్ అయింది.
ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. చిన్న సినిమాలు కూడా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాయి. పైరసీ తగ్గటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ కొత్త డొమైన్స్‌తో మళ్లీ రిటర్న్ అయింది. బప్పం టీవీ, మిర్రర్ లింక్స్ అంటూ కొత్త రూపంలో రీఎంట్రీ ఇవ్వడం..ఈ వారంలో రిలీజ్ అయిన చిన్న సినిమాలు కూడా వెంటనే అందులో అప్‌లోడ్ కావడంతో ఇండస్ట్రీ మరోసారి షాక్ అయింది. త్వరలో రిలీజ్ కాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పెద్ది మూవీ మేకర్స్‌కు ఐ బొమ్మ టెన్షన్ పట్టుకుందన్న డిస్కషన్ జరుగుతోంది.
పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ 3 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. దాదాపు 300-350 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 1980నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీపై హైప్ భారీగా పెరిగింది. పాన్ ఇండియా లెవల్‌లో థియేట్రికల్ వసూళ్లు భారీగా ఆశిస్తున్న ఈ మూవీ పైరసీ అయితే ఊహించనంత నష్టం ఉంటుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

