Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు?

PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు?

10tv 5 days ago
  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో ఖాతాల్లోకి రూ.6వేలు
  • పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్
  • పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.4వేలు

PM Kisan 24th Installment: రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక్ అప్‌డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ తొలి వారంలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం..

అక్టోబర్‌లో PM Kisan 24వ విడత?
దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇదివరకే 23వ విడత నిధులు రైతులకు అందాయి. ఇప్పుడు 24వ విడత కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ విడతను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో పీఎం కిసాన్ 24వ విడత విడుదలకు కేంద్రం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్.. ఒకేసారి రూ.6వేలు? :
ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఈసారి అదనపు బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రూ.6వేలు వార్షిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు వార్షిక పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ నిధుల విడుదలపై కసరత్తు జరుగుతోంది.

పీఎం కిసాన్ 24వ విడతలో కేంద్రం రూ.2వేలు విడుదల చేయనుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను కలిపి రూ.6వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అంటే కేంద్రం నుంచి రూ.2వేలు, రాష్ట్రం నుంచి రూ.4వేలు కలిపి ఒక విడతలో రూ.6వేలు రైతుల ఖాతాలో పడతాయి. మిగిలిన మొత్తాన్ని తదుపరి విడతల్లో పొందవచ్చు.

ఈ తప్పులుంటే డబ్బులు ఆగిపోవచ్చు :

ఈ రెండు పథకాల్లో మీ పేరు ఉన్నంత మాత్రాన ప్రతి విడతా డబ్బులు ఖాతాలో పడతాయని అనుకోవద్దు. పీఎం కిసాన్ బెనిఫిట్స్ పొందాలంటే రైతులు కొన్ని వివరాలను తప్పనిసరిగా సరి చేసుకోవాలి.

e-KYC కంప్లీట్ : ఆధార్ ఆధారిత e-KYC పూర్తి కాకపోతే తర్వాతి విడత పేమెంట్ నిలిచిపోవచ్చు
ల్యాండ్ వివరాలు మ్యాచింగ్ : రైతు పేరుతో ఉన్న వ్యవసాయ భూమి వివరాలు సంబంధిత రికార్డుల్లో, పోర్టల్‌లో సరిగ్గా ఉండాలి
బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌ : బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలి. అవసరమైన ఆధార్ లింకింగ్, సీడింగ్ కూడా ఉండాలి
అర్హత నిబంధనలు : ఆదాయపు పన్ను చెల్లించే వారు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనాలు పొందలేరు.

పీఎం కిసాన్ డబ్బులు వస్తాయో లేదో ఇలా చెక్ చేసుకోండి :

  • రైతులు తమ పీఎం కిసాన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లోనే ఈజీగాచెక్ చేసుకోవచ్చు.
  • ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ను ఓపెన్ చేయాలి.
  • (Farmers Corner) కేటగిరీలోకి వెళ్లాలి.
  • Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అడిగిన వివరాలను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
  • మీ e-KYC, ల్యాండ్ సీడింగ్, పేమెంట్ స్టేటస్ వంటి వివరాలను చెక్ చేయొచ్చు.

రైతులు ఇప్పుడే ఏం చేయాలి? :
పీఎం కిసాన్ 24వ విడత కోసం చూసే రైతులు చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దు. ఇప్పుడే e-KYC, ల్యాండ్ వివరాలు, ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

మొత్తంగా.. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనే పీఎం కిసాన్ 24వ విడత విడుదల కానుంది. అలాగే ఏపీ రైతులకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడనున్నాయి. ఈ రెండు కలిపి పండుగల వేళ రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. అయితే, డబ్బులు విడుదల తేదీ, పేమెంట్ విధానంపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv