Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM Modi in AP: ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్‌పాడ్‌లా భోగాపురం ఎయిర్ పోర్టు.. ప్రధాని మోదీ

PM Modi in AP: ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్‌పాడ్‌లా భోగాపురం ఎయిర్ పోర్టు.. ప్రధాని మోదీ

10tv 6 days ago

PM Narendra Modi: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్ వేగా పనిచేస్తుంది.. ఈ ఎయిర్ పోర్టు ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్‌పాడ్‌లా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. రూ.18వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు.

సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రమాణాలు.. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం దక్కిందని మోదీ అన్నారు. ఈ సభా వేదిక ద్వారా 18వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని శరవేగంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని మోదీ అన్నారు. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక్క కుటుంబం పేర్లే ఉండేవి. అయోధ్యలో ఎయిర్ పోర్టుకు వాల్మీకి పేరు, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేరు పెట్టాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని మోదీ అన్నారు.

దేశంలో 2014కు ముందు 74 ఎయిర్ పోర్టులు ఉండేవి.. ఎన్డీఏ హయాంలోని 12ఏళ్ల కాలంలో 166 ఎయిర్ పోర్టులు వచ్చాయని మోదీ చెప్పారు. ఐటీ సెక్టార్లో తెలుగువాళ్లకు మంచి పేరుంది. దేశ, విదేశాల్లో తెలుగువాళ్లు తమ సత్తా చాటుతున్నారు. ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని మోదీ అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ మారుతోంది. ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మోదీ అన్నారు. ఏపీలో గ్రోత్‌ ఎకో సిస్టం నిర్మిస్తున్నాం. సెమీకండక్టర్‌, డేటా సెంటర్‌ రంగాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయి. కేంద్రం.. నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే డబుల్‌ స్పీడ్‌తో ఏపీ అభివృద్ధి'' అని మోదీ తెలిపారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను చూసి మధురానుభూతికి లోనయ్యానన్న ప్రధాని మోదీ.. ఒకేసారి 13వేల మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతం. చంద్రబాబు విజన్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ మోదీ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv